కేరళలో పోలింగ్ బూత్ ఏజెంట్ హత్య
కేరళ | కేరళ కన్నూరు జిల్లాలోని పానూరులో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి చెందిన కార్యకర్త

తిరువనంతపురం : కేరళ కన్నూరు జిల్లాలోని పానూరులో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి చెందిన కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ కార్యకర్త కొత్తుపరంబ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్నాడు. అయితే అతను బోగస్ ఓట్లు వేయించినట్లు సీపీఐ(ఎం) కార్యకర్తలు ఆరోపించారు.
ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు ఐయూఎంఎల్ కార్యకర్తతో పాటు అతని సోదరుడిపై దాడి చేశారు. కార్యకర్తను తీవ్రంగా చితకబాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు తీవ్ర గాయాల పాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పానూరులో పోలీసులు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి..
మెట్రో సూచన.. రాత్రి 10కి ముందే ప్రయాణాలు ముగించుకోండి
వైరస్ వ్యాప్తికి వలస కార్మికులే కారణం : రాజ్ థాకరే
హమారా కెమెరా శారద
తెలంగాణలో మండుతున్న ఎండలు
అపోహాలు వద్దు..వాక్సిన్ వేసుకోండి
మహారాష్ర్టలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

