మెట్రో సూచన.. రాత్రి 10కి ముందే ప్రయాణాలు ముగించుకోండి
మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందనివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు. ఏప్రిల్ 30వతేదీ వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రయాణాలను రాత్రి 10 గంటలకు ముందుగానే ముగించుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అత్యవసర సర్వీసులకు చెందిన వారిని రాత్రి 10 గంటల తర్వాత కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తామని, అయితే వారు తమ గుర్తింపుకార్డులను చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదిధింగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లకు వెళ్లేవారికి, గర్భిణులు, రోగులు, రాయబార కార్యాలయాల ఉద్యోగులు ప్రయాణించవచ్చని అధికారులు చెప్పారు. ఆరోగ్యశాఖ, పోలీసు, జైళ్లు, హోంగార్డులను, సివిల్ డిఫెన్స్ వంటి అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయించినట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్ముఖ్
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
నీతి ఆయోగ్లో నల్లగొండవాసి
తెలంగాణలో మండుతున్న ఎండలు
సూపర్నోవా విస్ఫోటం గుర్తింపు
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

