అక్టోబర్ నాటికి ఇండియాలో మరో ఐదు కరోనా వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ ఇండియాకు కాస్త ఊరట కలిగించే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి దేశంలో మరో ఐదు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటికి అదనంగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ (బయోలాజిక్ ఇ ద్వారా), నొవావాక్స్ వ్యాక్సిన్ (సీరమ్ ద్వారా), జైడస్ కాడిలా వ్యాక్సిన్, భారత్ బయోటెక్‌కు చెందిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా 20 వరకూ వ్యాక్సిన్లు క్లినికల్ ప్రయోగ దశలో ఉన్నాయి. అందులో స్పుత్నిక్ వికి ముందుగా అనుమతి లభించే అవకాశాల ఉన్నాయి. మరో పది రోజుల్లోనే స్పుత్నిక్ వికి గ్రీన్‌సిగ్నల్ రావచ్చనీ ఆ వర్గాలు తెలిపాయి. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటెరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ బయోఫార్మా, విక్రో బయోటెక్ ఈ స్పుత్నిక్ విని తయారు చేస్తున్నాయి. దేశంలో 85 కోట్ల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం ఉండటం చాలా పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
స్పుత్నిక్ వి జూన్‌లోగా అందుబాటులోకి రావచ్చు. ఇక జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా ఆగస్ట్ నాటికి రావచ్చని, నొవావాక్స్ సెప్టెంబర్‌లో, ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
సన్‌రైజర్స్ vs నైట్‌రైడర్స్.. ఆ ఇద్దరు కీ ప్లేయర్స్ ఎవరో చెప్పగలరా?
సన్‌రైజర్స్ సక్సెస్ సీక్రెట్ చెప్పిన రషీద్ ఖాన్
అదరగొట్టిన క్రిస్ గేల్.. బికినీ భామలు, ఇండియన్ ర్యాపర్‌తో సాంగ్
పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన మాజీ పేస్ బౌలర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రత్యేక పూజలు
ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడు.. మేఘన్ రావడం లేదు!
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

