Pahalgam Attack : పహల్గామ్లోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం కాగా.. శనివారం మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో పేల్చేసింది. ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరలవుతున్నాయి.
అనంత్‌నాగ్ జిల్లా అధికారులతో సమన్వయంతో కుప్వారాలో ఉన్న ఫరూక్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని గుర్తించిన సైన్యం.. దాన్ని నేలమట్టం చేసింది. పహల్గామ్ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇప్పటివరకూ ఆరు ఇళ్లను కూల్చేసింది. పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఫరూక్ ఇంటితో పాటు ఉగ్రదాడిలో పాల్గొన్న మిగతావాళ్లకు సంబంధించిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొంది భారత సైన్యం.
House of Pakistan-based LeT terrorist Farooq Teedwa demolished in a blast in North Kashmir’s Kalaroos Kupwara.#Kupwara #Kashmir #LeT #Terrorism #SecurityForces #PahalgamTerroristAttack #PahalgamTerrorAttack #pahalgamattack pic.twitter.com/lsuAIdDDbR
— Kashmir Scan (@KashmirScan) April 26, 2025
పహల్గామ్లో నెత్తురు పారించిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను భారత ఆర్మీ ఒక్కొక్కటిగా పేల్చి వేస్తోంది. థోకేరపురాలోని ఆదిల్ అహ్మద్ థోకర్ ఇంటిని నామరూపాల్లేకుండా చేసిన సైనికులు.. పుల్వామాలోని ముర్రాన్లోని అషాన్ ఉల్ హక్ షేక్ ఇంటిని, ట్రాల్ లోని అసిఫ్ అహ్మద్ షేక్,చోటిపొరాలోని షాహిద్ అహ్మద్, కుల్గామ్‌లోని జహిద్ అహ్మద్ గనీల ఇళ్లను పేల్చివేసింది.
పహల్గామ్లో ఏప్రిల్ 22న మధ్యాహ్యం టెర్రరిస్టులు ఇద్దరు విదేశీ యాత్రికులతో కలిపి 28 మంది భారత పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఐడీ కార్డులు చూసి మరీ.. హిందువులను కాల్చి చంపారు. ఉన్మాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు యావత్ భారతం నివాళులు అర్పిస్తోంది. పలు చోట్ల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు.