BRS Party | లండన్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
BRS Party | లండన్లో ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించారు. అనంతరం అమరవీరులు, ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులర్పించి.. ఎన్నారైలంతా జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
BRS Party | లండన్లో ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ జరిపారు. అనంతరం అమరవీరులు, ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులర్పించి.. ఎన్నారైలంతా జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ని మనం కాపాడుకోవాలలన్నారు. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్ష అన్నారు.
చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సతీశ్ రెడ్డి గొట్టెముక్కల కోరారు. నాటి ఉద్యమం నుంచి నేటి వరకు లండన్ నుంచి ప్రత్యేక కార్యాచరణతో అనుక్షణం పార్టీ వెంట ఉన్నామని, అవకాశం కలిపించిన కేసీఆర్, కేటీఆర్, పార్టీ పెద్దలకు ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవి కుమార్ రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్ కుప్పాల, కార్యదర్శి సురేష్ గోపతి, ఐటీ-మీడియా కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేశ్ ఇస్సంపల్లి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా-మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, సభ్యులు పవన్ కల్యాణ్, సంతోష్, ఉదయ్, అజయ్ రావు గండ్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

