IPL 2025 : భారీ ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌కు వర్షం(Rain) అంతరాయం కలిగించింది. మొదటి ఓవర్ పూర్తికాగానే ఈడెన్ గార్డెన్స్‌లో చినుకులు మొదలయ్యాయి. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు. సిబ్బంది పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు.
వాన పడే సమయానికి కోల్‌కతా వికెట్ కోల్పోకుండా 7 పరగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(1), సునీల్ నరైన్(4)లు క్రీజులో ఉన్నారు. ఇంకా కోల్‌కతా విజయానికి 195 పరుగులు అవసరం. ఒకవేళ వాన కారణంగా ఓవర్లు కుదించాల్సి వస్తే.. లక్ష్యాన్ని తగ్గించే అవకాశముంది.
Innings Break
Strong comeback by the #KKR bowlers 👏
Are we in for another thriller? 🤔
Scorecard ▶ https://t.co/oVAArAaDRX #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/my3RtluYkp
— IndianPremierLeague (@IPL) April 26, 2025
టాస్ గెలుపొంది మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(83), ప్రియాన్ష్ ఆర్య(69) మరోసారి రెచ్చిపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌లు అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరి విధ్వంసంతో పంజాబ్ భారీ స్కోర్ కొట్టింది. ఆఖర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.