IMD | మహారాష్ట్ర (Maharashtra)లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. పూణె (Pune), పాల్ఘర్, సతారాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇక అదేవిధంగా ముంబై (Mumbai), థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుర్గ్, నాసిక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా ధూలే, నందుర్బార్, జల్గావ్, అహ్మద్‌నగర్, కొల్హాపూర్, ఔరంగాబాద్, జల్నా, పర్భానీ, బీడ్, హింగోలి, నాందేడ్, అకోలా, నాగ్‌పూర్, అమరావతి, భండారా, బుల్దానా, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా సహా పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
For tomorrow, the Meteorological Department has issued a red alert for Pune, Palghar and Satara. An orange alert has been issued for Thane, Mumbai, Raigad, Ratnagiri, Sindhudurg and Nashik: IMD
— ANI (@ANI) August 3, 2024
Also Read..
UPSC Aspirant | ఢిల్లీలో యూపీఎస్సీ అభ్యర్థిని ఆత్మహత్య.. చాలా విసిగిపోయానంటూ నోట్
Kolkata | కోల్‌కతాను ముంచెత్తిన వర్షం.. ఎయిర్పోర్ట్ రన్‌వేపైకి చేరిన వర్షపు నీరు.. వీడియో