Kolkata | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata)ను భారీ వర్షం ముంచెత్తింది. కోల్కతా సహా దాని పరిసర ప్రాంతాల్లో గురు, శుక్ర వారాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక ఈ భారీ వర్షానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Netaji Subhash Chandra Bose International Airport) సైతం నీట మునిగింది. ఎయిర్పోర్ట్ రన్వే (Airport Runway)పైకి భారీగా వర్షపు నీరు చేరింది. విమానాల పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
कोलकता एयरपोर्ट ✈️#Kolkata #Airport #Kolkata #Paris2024 #WayanadLandslide #ManuBhakar #Mandi pic.twitter.com/QnSJwFViMU
— Guddu Chaurasia (@Guddu89cool) August 3, 2024
కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు మెరుపు వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 360 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక హిల్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ క్లౌడ్ బస్ట్ కారణంగా మెరుపు వరదల సంభవించాయి. దీంతో పలు చోట్ల గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రజలు మెరుపు వరదలకు గల్లంతయ్యారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Also Read..
Cloudburst | హిమాచల్లో వరద విలయం.. ఊరంతా కొట్టుకుపోయి.. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది
Pinarayi Vijayan | ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉంది : సీఎం పినరయి విజయన్