help steals gold, cash | బంగారు నగలు, నగదు చోరీ చేసిన పనిమనిషి.. 15 కుక్కలతో ఇంటిని కోటలా మార్చింది
help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు. (help steals gold, cash) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల సోనియా ఒక ఇంట్లో పనిమనిషిగా చేరింది. గత నెలలో ఆ ఇంట్లోంచి బంగారు ఆభరణాలు, డబ్బు చోరీ చేసి పారిపోయింది.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితురాలు సోనియా ఆచూకీని గుర్తించారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సుమారు 15 ప్రమాదకరమైన కుక్కలతో తన ఇంటి భద్రతను ఆమె పటిష్టం చేసిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా నిరోధించేందుకు పిట్‌బుల్స్, అమెరికన్ బుల్లీస్, హైబ్రిడ్ జాతుల కుక్కలను ఆ మహిళ పెంచుతున్నట్లు గ్రహించారు.
అయితే ప్రమాదకరమైన ఆ కుక్కలతో తన ఇంటిని కోటగా చేసుకుని నిందితురాలు సోనియా అందులో నివసిస్తున్నట్లు షాలిమార్ బాగ్ పోలీసులు పసిగట్టారు. దీంతో అత్యంత వ్యూహాత్మకంగా ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఆ ఇంట్లో దాక్కున్న నిందితురాలిని అరెస్ట్ చేశారు.
మరోవైపు సోనియాను ప్రశ్నించగా చోరీ చేసిన వాటిలో కొన్ని బంగారు నగలను పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి రూ.5 లక్షల రుణాలు పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆమె బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ ఇంటి నుంచి లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
మిగతా బంగారం, డబ్బును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితురాలి కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman kills live-in partner | వేధింపులు భరించలేక.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన మహిళ
Groom Shot Dead | ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వరుడు.. కాల్పులు జరిపి హత్య
Watch: రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించిన సీఎం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cash
- Delhi
- dogs
- Evade Arrest
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

