Groom Shot Dead | ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వరుడు.. కాల్పులు జరిపి హత్య
Groom Shot Dead | ఒక వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన వరుడు కారులోనే కుప్పకూలి మరణించాడు.
లక్నో: ఒక వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన వరుడు కారులోనే కుప్పకూలి మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బదౌర్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఆజాద్ బింద్ శుక్రవారం పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. తన బంధువులతో కలిసి ఊరేగింపుగా కారులో పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు.
కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు బైక్‌పై వచ్చారు. బీబీపూర్ గ్రామం సమీపంలో వరుడు ఉన్న కారును అడ్డగించారు. ఆజాద్ బింద్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పెళ్లికొడుకు ఆ కారులో కుప్పకూలి మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధువు బంధువైన ప్రియుడు వరుడ్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వధువు మొబైల్ ఫోన్ కాల్స్ పరిశీలిస్తామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
IIT Jodhpur | ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీటి సమస్య.. వాటర్ ట్యాంకర్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

