IIT Jodhpur | ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీటి సమస్య.. వాటర్ ట్యాంకర్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్‌కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీటి సమస్య కొరత ఏర్పడింది. దీంతో క్యాంపస్‌కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (IIT Jodhpur) జాతీయ ప్రాముఖ్యత కలిగిన రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాల పరంగా పలు సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో చదువు, పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కొరత నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ నుంచి నీటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ అవినాష్ కుమార్ అగర్వాల్ దీనిపై స్పందించారు. రాజస్థాన్‌లో శుభ్రమైన నీటి సరఫరా లేని ఏకైక కేంద్ర సంస్థ ఐఐటీ జోధ్‌పూర్ మాత్రమే అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నీటి సరఫరా జరుగుతున్నట్లు చెప్పారు. అయితే వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా పంపింగ్ స్టేషన్‌లోని మోటార్ దెబ్బతినడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు.
మరోవైపు సిబ్బంది 30 గంటలు శ్రమించారని, నీటి సరఫరాను పునరుద్ధరించారని ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ వివరించారు. అయితే నీటి సరఫరా అంతరాయం సమయంలో సుర్పురా గ్రామం నుంచి వాటర్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నదని వాపోయారు. స్థిరమైన నీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఐఐటీ క్యాంపస్‌కు నేరుగా పైప్‌లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన అన్నారు.
🚨 Water shortage issues at IIT Jodhpur, Rajasthan. 🙏 pic.twitter.com/9keKpt9ch3
— Indian Tech & Infra (@IndianTechGuide) May 1, 2026
IIT Jodhpur Director Avinash Agarwal reacts to the water crisis at the campus pic.twitter.com/YibuFiPbA8
— NDTV (@ndtv) May 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

