Watch: రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించిన సీఎం.. తర్వాత ఏం జరిగిందంటే?
Mohan Yadav | రైతులకు సమాచారం కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను సీఎం ప్రారంభించారు. దాని పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇది చూసి అక్కడున్న జనం నవ్వుకున్నారు.
భోపాల్: రైతులకు సమాచారం కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను సీఎం ప్రారంభించారు. దాని పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇది చూసి అక్కడున్న జనం నవ్వుకున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. రైతులకు వ్యవసాయంలో సూచనలు, సమాచారం కోసం ఉచిత రైతు హెల్ప్‌లైన్ నంబర్ 155253ను సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) గురువారం ప్రారంభించారు. ఆ తర్వాత దాని పరితీరును తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా ఆ హెల్ప్‌లైన్‌కు డయల్ చేశారు.
కాగా, తనను తాను సాధారణ రైతుగా సీఎం మోహన్ యాదవ్ పరిచయం చేసుకున్నారు. వేసవికి అనువైన పంటను సూచించమని ఆ హెల్ప్‌లైన్‌ను అడిగారు. అయితే ‘ప్రస్తుతానికి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు’ అని హెల్ప్‌లైన్ ఆపరేటర్ నుంచి సమాధానం వచ్చింది. సంబంధిత అధికారి ఆయనను సంప్రదించి సమాచారం ఇస్తారని బదులిచ్చింది. ఇది విని అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. దీంతో సీఎం వెంటనే మైక్ ఆపివేశారు.
మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. యంత్రాంగం సిద్ధంగా లేకుండానే రైతు హెల్ప్‌లైన్ ప్రారంభించారని విమర్శించారు.
This is why Top Ji doesn’t give unscripted ambulance clearances.
MP CM Mohan Yadav was launching Kisan Helpline number.
He decided to call the number posing as a farmer.
He was not ready for what happened next 😭 pic.twitter.com/6yR3GrgKw8
— Nimo Yadhuvanshi Parody (@NimoYadhuvanshi) May 1, 2026
Also Read:
IIT Jodhpur | ఐఐటీ జోధ్‌పూర్‌లో తాగునీటి సమస్య.. వాటర్ ట్యాంకర్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు
Groom Shot Dead | ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వరుడు.. కాల్పులు జరిపి హత్య
.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

