ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 14:05:48

చాయ్ వాలాకు రూ.50 కోట్ల బ్యాంకు అప్పు

చాయ్ వాలాకు రూ.50 కోట్ల బ్యాంకు అప్పు

చండీగఢ్: అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన ఒక టీస్టాల్ యజమానికి అధికారులు షాక్ ఇచ్చారు. అతడు రూ.50 కోట్ల రుణం తీసుకున్నట్లు చెప్పి ఆ మొత్తాన్ని కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ చాయ్‌వాలా లబోదిబోమంటున్నాడు. హర్యానాలోని కురుకేత్రకు చెందిన రాజ్ కుమార్ టీ అమ్ముకుని జీవిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వ్యాపారం దెబ్బతినడంతో రుణం కోసం ఇటీవల బ్యాంకుకు దరఖాస్తు చేశాడు.

అయితే అప్పటికే రాజ్ కుమార్ పేరున రూ.50 కోట్ల మేర అప్పు ఉన్నదంటూ అతడి దరఖాస్తును బ్యాంకు అధికారులు తిరస్కరించారు. మరోవైపు తాను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకు నుంచి రుణం తీసుకోలేదని రాజ్ కుమార్ చెబుతున్నాడు. అలాంటిది తాను ఏకంగా రూ.50 కోట్లు బ్యాంకుకు బాకీ పడటం ఎలా జరిగిందో తెలియడం లేదని వాపోయాడు.


logo