థియేటర్లు మూసేయాలి..

- ఇండోర్ మీటింగ్‌లను 2 నెలలు నిషేధించాలి
- భారత్‌లో కరోనా నియంత్రణకు ఇవి తప్పనిసరి
- లాన్సెట్ ఇండియా టాస్క్‌ఫోర్స్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారతదేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే థియేటర్లు, ఆడిటోరియాలు మూసివేయాలని, ఇండోర్ సమావేశాలపై కనీసం రెండు నెలల పాటు పూర్తిగా నిషేధం విధించాలని ప్రముఖ అంతర్జాతీయ వైద్యపత్రిక ‘లాన్సెట్’.. కొవిడ్ 19 కమిషన్ ఇండియాలో నియమించిన టాస్క్‌ఫోర్స్ సూచించింది. పెండ్లిళ్లు, పండుగలు తదితర మతపరమైన, సామాజిక కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కుంభమేళా, ఎన్నికలు వైరస్ తీవ్రంగా వ్యాపించడానికి కారణమని పేర్కొన్నది. ఈ మేరకు భారత్‌లో కరోనా వ్యాప్తిపై టాస్క్‌ఫోర్స్ ఒక నివేదికను విడుదల చేసింది. వచ్చే రెండు నెలలపాటు పది కన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని, కఠినమైన నిఘా పాటించాలని సూచించింది. రోజూ లక్షల కేసులు నమోదవుతుంటే రాజకీయసభలు, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని గుర్తు చేసింది. టెస్టింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ విధానాన్ని సమర్థంగా కొనసాగించాలని సూచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

