రెమ్‌డెసివిర్ రేట్లు తగ్గాయి

- కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు
- వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు
- కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్‌డెసివిర్ ధరలు భారీగా (సగటున రూ.1500) తగ్గాయి. కొన్ని కంపెనీలు దాని ధరను దాదాపు సగంవరకు తగ్గిం చాయి. ఈ ఔషధ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, ధరలను తగ్గించాలని కేంద్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఫార్మా సంస్థలు రెమ్‌డెసివిర్ రేట్లను తగ్గించాయి. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) శనివారం ప్రకటన చేసింది. దీంతో లక్షలాది మంది కరోనా రోగులకు ఊరట లభించింది. ఫార్మా సంస్థల నిర్ణయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ స్వాగతించారు. కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు ఉపశమయం లభించే విషయం ఇది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఫార్మా సంస్థలు రెమ్‌డెసివిర్ ధరలను తగ్గించాయి. కరోనాపై పోరులో ప్రధాని మోదీతో కలిసి నిలబడ్డ ఫార్మా సంస్థలకు నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.
కంపెనీ బ్రాండ్ మునుపటి సవరించిన
ధర(వయల్) ధర(వయల్)
క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రెమ్‌డాక్ 2,800 899
సింజెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెమ్‌విన్ 3,950 2,450
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రెడిక్స్ 5,400 2,700
సిప్లా లిమిటెడ్ సిప్రెమి 4,000 3,000
మైలాన్ ఫార్మాస్యూటికల్స్ డెస్రెమ్ 4,800 3,400
జుబిలెంట్ జెనెరిక్స్ లిమిటెడ్ జుబి-ఆర్ 4,700 3,400
హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ కొవిఫర్ 5,400 3,490
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

