Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీ చేశారు. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో (Tariffs) దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. అత్యధికంగా కంబోడియా దిగుమతులపై 49 శాతం, భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై భారత్ తాజాగా స్పందించింది. ట్రంప్ నిర్ణయం భారత్‌కు ఎదురుదెబ్బ కాదని పేర్కొంది.
ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించినట్లు తెలిపింది. అయితే, ఇక్కడో మార్గం ఉందని పేర్కొంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పునఃపరిశీలించే నిబంధన ఉందని పేర్కొంది. కాబట్టి ట్రంప్ నిర్ణయం భారత్‌కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారు తెలిపారు.
కాగా, గురువారం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు దేశాలపై ట్రంప్ టారీఫ్‌ల మోత మోగించారు. దీనిని అమెరికాకు విమోచన దినోత్సవంగా (లిబరేషన్ డే) అభివర్ణించిన ట్రంప్.. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికాకు మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని, అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ప్రతీకార సుంకాలను రాయితీ టారీఫ్లుగా అభివర్ణించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలపై జాలితోనే సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 26 శాతం సుంకాలు విధిస్తున్నామన్నారు. ఇక చైనాపై 34 శాతం, ఈయూపై 20 శాతం సుంకాలు విధించినట్లు తెలిపారు. ప్రతికార సుంకాలతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయన్నారు.
Also Read..
Trump Tariffs | సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే..?
Donald Trump | ట్రంప్ టారీఫ్‌ల మోత.. భారత్‌పై ఎంతంటే?
Russia | రోగుల్లో శ్వాసకోశ సమస్యలు, నోటి నుంచి రక్తం.. రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్!