భోపాల్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (Family Suicide) ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టెహార్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మనోహర్ లోధి, ఆయన కుమార్తె 18 ఏళ్ల శివాని, కుమారుడైన 16 ఏళ్ల అంకిత్, వారి నానమ్మ 70 ఏళ్ల ఫుల్రానీ లోధి శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు.
కాగా, తెల్లవారుజామున 3 గంటల సమయంలో మనోహర్ లోధి వాంతులు చేసుకున్న శబ్దాన్ని సోదరుడు నందరామ్ సింగ్ లోధి విన్నాడు. పొరుగు వారిని అలెర్ట్ చేయడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఖురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. వృద్ధురాలైన ఫుల్రానీ లోధి, అంకిత్ అప్పటికే మరణించినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు. సాగర్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసిన తర్వాత శివానీ చనిపోయిందని, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మనోహర్ లోధి మరణించినట్లు చెప్పారు.
మరోవైపు ఆ నలుగురు సల్ఫస్ మాత్రలు మింగినట్లు డాక్టర్ తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మనోహర్ లోధి భార్య కొన్ని రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లిందని పోలీస్ అధికారి తెలిపారు. వారి ఆత్మహత్యకు కారణాల గురించి తెలుసుకుంటామని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Wife Poisons Husband Twice | వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు