ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచారం వెల్లడైంది. గడ్చిరోలి జిల్లాలోని ఖుర్ఖేడ ఏరియా ఖోబ్రామెంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఇవాళ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు పరస్పరం ఎదురుపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించగా ఐదు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. కాగా, ఘటనా ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Maharashtra: 5 naxals killed in an encounter with security forces in Khobra-Mendha forest area of Kurkheda in Gadchiroli. pic.twitter.com/sIrOUqOH9q
— ANI (@ANI) March 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్