e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News లండ‌న్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు

లండ‌న్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు

లండ‌న్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు

నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా లండ‌న్‌కే ప‌రిమిత‌మైంది. హాలీవుడ్ సినిమాల‌లో న‌టిస్తూ మ‌రో వైపు వ్యాపారాల‌ను ప్రారంభిస్తుంది. న్యూయార్క్ లో ‘సోనా’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన విష‌యాన్ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప్రియాంక చోప్రా.. ఈ రెస్టారెంట్ లో నోరూరించే భారతీయ వంటకాలను వండి వడ్డించనున్నారని పేర్కొంది. తాను లండన్ లో ఉండడంతో రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన‌లేక‌పోయాన‌ని కూడా వెల్ల‌డించింది ఈ ముద్దుగుమ్మ‌.

ప్రతి వేడుక‌ను సంతోషంగా జ‌రుపుకునే ప్రియాంక చోప్రా హోలీ వేడుక‌ను త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ప్రియాంక త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాకు న‌చ్చిన పండుగ‌ల‌లో హోలీ ఒక‌టి. ప్ర‌తి ఒక్క‌రు మీ శ్రేయోభిలాషుల‌తో ఇంట్లోనే హోలీ వేడుక జ‌రుపుకుంటారని ఆశిస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లండ‌న్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు

ట్రెండింగ్‌

Advertisement