Earthquake | ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 16 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రకంపనల ధాటికి భవనాలు ఊగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Waqf Bill | వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!
Bonakallu | ఓటర్లు 34 మంది, సిబ్బంది 32 మంది..! ఇదీ ఓ పోలింగ్ కేంద్రంలోని పరిస్థితి
BRS | నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న బీఆర్ఎస్ బృందం