Waqf Bill | వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించేందుకు మార్గం సుగమమైంది.
కాగా, వక్ఫ్(సవరణ) బిల్లుపై (Waqf (Amendment) Bill) ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికను ఈనెల 13న పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభలో జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదాంబికా పాల్, రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధా విశ్రమ్ కుల్కర్ణి నివేదికను ప్రవేశపెట్టారు. అయితే, జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు.
నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అయితే, భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇది ఫేక్ నివేదిక అని, మెజారిటీ సభ్యుల ఆలోచనలనే నివేదికలో పొందుపర్చడం అప్రజాస్వామికమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాగా, నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్‌కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఇక విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
ఈ నేపథ్యంలోనే గత వారం ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మార్చి 10న ప్రారంభం కానున్న రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగసుగమమైంది.
కాగా, జనవరి 29న ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. 15-11 మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సబంధించిన నివేదికను ఆమోదించింది. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి. వక్ఫ్ అలాల్ ఔలాద్ (కుటుంబ వక్ఫ్‌లు)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి.
అయితే, ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్(అసమ్మతి) నోట్‌ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
Also Read..
NEET PG | నీట్-పీజీ కనీస అర్హత మార్కులు తగ్గింపు
Indore IIT | వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్.. ఇండోర్ ఐఐటీ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ
AI | ఏ పనికైనా ఏఐ ఏజెంట్ సిద్ధం! కీలక నిర్ణయాల్లో అప్రమత్తత తప్పదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

