Indore IIT | వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్.. ఇండోర్ ఐఐటీ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ
Indore IIT | ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్-పాథోజెనిక్ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో కలిపి కాంక్రీట్‌లో మిళితం చేయడం ద్వారా దృఢమైన నిర్మాణ పదార్థాన్ని తయారు చేశారు.
- నిర్మాణ బలం రెట్టింపు, కర్బన ఉద్గారాల తగ్గుదల
Indore IIT | ఇండోర్, ఫిబ్రవరి 26: ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్-పాథోజెనిక్ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో కలిపి కాంక్రీట్‌లో మిళితం చేయడం ద్వారా దృఢమైన నిర్మాణ పదార్థాన్ని తయారు చేశారు. నిర్మాణ బలాన్ని రెట్టింపు చేయడంతోపాటు కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయడం ఈ కాంక్రీట్ ప్రత్యేకత. ఆహార వ్యర్థాలు కుళ్లిపోతే కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది.
ఆ వ్యర్థాలతోపాటు బ్యాక్టీరియాను కాంక్రీట్‌లో కలిపితే అందులో ఉండే కాల్షియం అయాన్లతో కార్బన్ డయాక్సైడ్ చర్య జరిపి కాల్షియం కార్బొనేట్ స్ఫటికాలను ఏర్పరుస్తుందని ఇండోర్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సందీప్ చౌదరి వెల్లడించారు. ఈ స్ఫటికాలు కాంక్రీట్‌లోని రంధ్రాలు, పగుళ్లను పూడ్చేస్తాయని, తద్వారా ఆ కాంక్రీట్ బరువుపై పెద్దగా ప్రభావమేమీ చూపదని, పైగా దాని దృఢత్వాన్ని బాగా పెంచుతాయని ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

