NEET PG | న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్‌గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) కనీస అర్హతను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మరోసారి తగ్గించింది. కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చునని తెలిపింది.
ఇది అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు వర్తిస్తుందని చెప్పింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. 2024 ఆగస్టు 23న ప్రచురించిన నీట్-పీజీ, 2024 ర్యాంక్, పర్సంటైల్ స్కోర్‌లో ఎటువంటి మార్పులు ఉండవని వివరించింది.