బోనకల్లు ఫిబ్రవరి 27: ఖమ్మం -వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc electinons) పోలింగ్ కేంద్రాన్ని బోనకల్లు మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో మండలంలో కేవలం 34 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయులు ఓటు వినియోగించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్ల కంటే ఈ ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందితోపాటు అభ్యర్థుల ఏజెంట్లు మొత్తం 32 మంది పర్యవేక్షణ చేయడం విశేషం.
ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సెక్ట్రోల్ ఆఫీసర్ కడారు విజయభాస్కర్ రెడ్డి, తాసిల్దార్ అనిశెట్టి పున్నమి చందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ఉపాధ్యాయ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ఐ మధుబాబు బందోబస్తు నిర్వహించగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య క్యాంపు నిర్వహించారు.