హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్( SLBC tunnel )వద్దకు వెళ్లనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అండగా ఉంటామన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మా వంతు సహాయ సహాకారాలు అందజేస్తామన్నారు. త్వరతగతిన చర్యలు తీసుకోవడానికి మా సూచనలు అందజేయాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ బృందం వెళ్తుందన్నారు.
కాగా, నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి. పైకప్పు కూలిపోవడం, భారీగా నీరు, బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నది. బుధవారం సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు మార్కోస్, ర్యాట్ మైనర్స్ టీమ్ తీవ్రంగా శ్రమించాయి.
ఎట్టకేలకు 14వ కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్ మిషన్ కన్వేయర్ బెల్టు, ఆక్సిజన్ ట్యూబ్, శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. సొరంగం మొత్తం మూసుకుపోవడంతోపాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందుభాగం ధ్వంసమై వెనుకభాగం తన్నుకువచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు.
నేడు SLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్న హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం
ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు నాయకులతో కలిసి బయలుదేరనున్న హరీష్ రావు pic.twitter.com/R4MniwMIQp
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025