జగిత్యాల : జగిత్యాల జిల్లా (Jagithyal district) కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గుర్రం దయాకర్ (Gurram Dayakar).. యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ యోగా డేకు హాజరవుతుంటారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సూక్ష్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటారు.
ఈ ఏడాది యోగా డే కోసం ‘గుండు పిన్నుపై ఒంటికాలుతో నిలబడి బ్యాలెన్సింగ్ యోగాసనం వేస్తున్న మహిళ’ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి గుండు పిన్ను, మైనం, పెన్సిల్ కలర్స్ వినియోగించాడు. విగ్రహం తయారీకి 10 గంటల సమయం పట్టిందని డాక్టర్ గుర్రం దయాకర్ చెప్పారు.