Manish Sisodia : పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు (Senior leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఏసీబీ ముందు హాజరుకానున్నారు. ఆప్ హయాంలో ఢిల్లీ (Delhi) లోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ అక్కడి బీజేపీ సర్కారు విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ మనీశ్ సిసోడియా ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇవాళ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఏసీబీ ముందు ఉంచుతా. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరిపిత కేసు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడం కేవలం బీజేపీకే సాధ్యం. ఈ కేసు పూర్తిగా తప్పుడు కేసు. ఈ కేసులో ఎలాంటి అవినీతి బయటపడే ఛాన్స్ లేదు.’ అని సిసోడియా అన్నారు.