Operation Sindoor | లోక్‌సభ (Lok Sabha)లో ‘ఆపరేషన్ సిందూర్’పై (Operation Sindoor) ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. పలుమార్లు వాయిదాల అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనమిన రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.
ఆత్మరక్షణ కోసమే..
‘ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనం. భారత సైనికులకు నా సెల్యూట్. దేశ ప్రజలను రక్షించడం మా బాధ్యత. పాక్ పౌరులకు నష్టం కలగకుండా దాడులు చేశాం. 22 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తి చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఆత్మరక్షణమే కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్‌తో అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని రక్షణ మంత్రి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
On Operation Sindoor, Defence Minister Rajnath Singh says, “Our actions were entirely in self-defence, neither provocative nor expansionist. Yet, on May 10, 2025, at approximately 1:30 AM, Pakistan launched a large-scale attack on India using missiles, drones, rockets, and other… pic.twitter.com/6CUXlcdg3x
— ANI (@ANI) July 28, 2025
ఆపరేషన్ ఆపాలని ఎలాంటి ఒత్తిడీ రాలేదు..
ఆపరేషన్ సిందూర్ ఆపాలని ఎలాంటి ఒత్తిడీ రాలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడికి పాక్ యత్నించినట్లు చెప్పారు. పాక్ దాడులను సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ముందుగా నిర్ణయించిన సైనిక లక్ష్యాలను సాధించినందుకే భారత్ తన చర్యను నిలిపివేసిందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడితోనో ఆపరేషన్ నిలిపివేసినట్లు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ‘ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికే ఈ ఆపరేషన్ ప్రారంభించాం. సరిహద్దు దాటడం, అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు. ఈ ఆపరేషన్ వెనుక ముఖ్య ఉద్దేశం పాక్ చాలాఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడం’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
#WATCH | Delhi | In Lok Sabha, Defence Minister Rajnath Singh says, “This Operation was launched to serve justice to those families who lost loved ones in the terror attack… Crossing the border or capturing territory was not the objective of Operation Sindoor. The… pic.twitter.com/5dR0C4voPr
— ANI (@ANI) July 28, 2025
ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. లోక్‌సభలో ఈ చర్చ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసనతో సభ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సిందూర్‌పై చర్చ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం సభలో చర్చ కొనసాగుతోంది.
Also Read..
Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్.. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Operation Sindoor | సిందూర్‌పై చర్చ.. అధికార, ప్రతిపక్షం నుంచి మాట్లాడేది వీళ్లే..