Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్‌సభ (Lok Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా సభలో మాట్లాడే ఎంపీల జాబితా తాజాగా విడుదలైంది. ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘సిందూర్’పై చర్చ ప్రారంభిస్తారు. బీజేపీ సీనియర్ నాయకులు బజ్‌యంత్ పాండా, విదేశాంగ మంత్రి జైశంకర్, తేజస్వి సూర్య, సంజయ్ జైస్వాల్, అనురాగ్ ఠాకూర్, కుమల్జీత్ సెహ్రావత్.. రాజ్‌నాథ్ ప్రారంభించిన చర్చపై ప్రభుత్వం తరఫున మాట్లాడనున్నారు. ఇక ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా, దీపీందర్ హుడా, ప్రణితి షిండే, సప్తగిరి ఉలాకా, బిజేంద్ర ఒలా పాల్గొంటారు. వీరితోపాటు పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా సిందూర్‌పై చర్చలో పాల్గొంటారు.
కొనసాగుతున్న వాయిదాల పర్వం..
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికి మూడుసార్లు దిగువ సభ వాయిదా పడింది. బీహార్‌లో ‘సర్’ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఇండియా కూటమి ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభా కార్యకలాపాలు ముందుకు సాగకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. 12 గంటలకు దిగువసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ చేపట్టాల్సి ఉంది. కానీ, విపక్ష ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలతో సభ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. దీంతో సభను 1 గంట వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో దిగువసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
Also Read..
Lok Sabha | లోక్‌సభ ప్రారంభం.. వెంటనే వాయిదా
Speaker Om Birla | లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం