న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ.. ఆపరేషన్ మహాదేవ్(Operation Mahadev) చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆ ముగ్గురు ఉగ్రవాదులు.. పెహల్గామ్లో ఉగ్రదాడి జరిపినవారిగా భావిస్తున్నారు.
ఇవాళ జరిగిన ఆపరేషన్ గురించి ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. లిద్వాస్ జనరల్ ఏరియాలో ఉగ్రవాదులతో కాంటాక్ట్ ఏర్పడినట్లు పేర్కొన్నది, ప్రస్తుతం ఆపరేషన్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు ఆ ట్వీట్లో తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా.. హర్వాన్‌లోని ముల్నార్ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించాయి.
భద్రతా బలగాలు సెర్చింగ్ చేస్తున్న సమయంలో కాల్పుల మోత వినిపించినట్లు అధికారులు చెప్పారు. తక్షణమే ఆ ప్రదేశానికి ఎన్ఫోర్స్మెంట్ దళాలు వెళ్లాయి. ఉగ్రవాదుల్ని కూంబింగ్ ద్వారా ట్రాక్ చేశారు. ఆ ప్రాంతంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తోంది.
Chinar Corps – Indian Army (@ChinarcorpsIA) posts, “Contact established in General Area Lidwas. Operation in progress.” pic.twitter.com/m5Vab6w4lS
— Press Trust of India (@PTI_News) July 28, 2025