Mungeshpur | దేశంలో ఈ వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మొన్నటికి మొన్న దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని ముంగేష్పూర్ (Mungeshpur) ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత నెల 29న ముంగేష్‌పూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చూపించింది.
అయితే, అది నిజం కాదని కేంద్ర భూగర్భ శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) శనివారం క్లారిటీ ఇచ్చారు. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సార్ లోపం కారణంగా ఇలా తప్పుగా ఉష్ణోగ్రతలు చూపించినట్లు శనివారం స్పష్టతనిచ్చారు. ‘మే29న ముంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదవడంపై భారత వాతావరణ బృందం విచారణ చేపట్టింది. ఇందులో సెన్సార్ లోపం కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా చూపించినట్లు తేలింది. ఆ రోజు ముంగేష్‌పూర్‌లో 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పరిశోధనల్లో తేలింది’ అని మంత్రి ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఐఎండీ (India Meteorological Department) సైతం దీనిపై క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ లోపం కారణంగా ప్రామాణిక పరికరం ద్వారా నివేదించబడిన గరిష్ట ఉష్ణోగ్రత కంటే దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా చూపించినట్లు తెలిపింది. ఆ రోజు ఢిల్లీలోని మరే ఇతర అబ్జర్వేటరీ 50 డిగ్రీల మార్కును దాటలేదని పేర్కొంది.
Also Read..
Case Against BJP MLA’s Son | విద్యార్థి నాయకుడిపై దాడి.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు
Marian Robinson | బరాక్ ఒబామా ఇంట్లో తీవ్ర విషాదం.. మిచెల్ తల్లి మృతి
Minister Jogi Ramesh | చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారో వెల్లడించాలి : మంత్రి జోగి రమేశ్ డిమాండ్