Marian Robinson | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఫస్ట్‌లేడీ, ఒబామా సతీమణి మిచెల్ ఒబామా (Michelle Obama) తల్లి మరియన్ రాబిన్సన్ (Marian Robinson) శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. ఈ విషయాన్ని బరాక్, మరియన్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుమార్తె, అల్లుడితో కలిసి మరియన్ శ్వేత సౌధంలోనే ఉన్నారు. ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణను ఆమే చూసుకున్నారు. మరియన్ను కుటుంబ సభ్యులు ముద్దుగా ‘మొదటి బామ్మ’ అని పిలుచుకుంటారు. మరియన్ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Drugs | చిన్నారుల టాయ్స్, లంచ్ బాక్సుల్లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Violence | తుదిదశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస.. ఈవీఎంలను నీటికుంటలో పడేసి
Salman Khan | పాక్ నుంచి తెచ్చిన ఏకే-47 తుపాకులతో.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర..!