Violence | లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి దశ పోలింగ్ (Final Phase Voting) సందర్భంగా పశ్చిమ బెంగాల్ (West Bengal ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు (Violence) చోటు చేసుకున్నాయి. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాలకు జరగుతున్న పోలింగ్‌లో హింస, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
जाधवपुर में वोटिंग में गड़बड़ी की शिकायत के बीच आपस में दो गुट भिड़ गए, जिसके बाद पुलिस ने लाठीचार्ज कर भीड़ को खदेड़ा !#WestBengal #VotingDay #LokSabhaElections #Elections2024 #PanchayatiTimes pic.twitter.com/uC5yBYfMpJ
— Panchayati Times (@panchayati_pt) June 1, 2024
రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు సమీపంలో ఉన్న జాదవ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని భాంగర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్), సీపీఐ (ఎం) మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు గాయాలపాలైనట్లు సమాచారం. ఇక దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లను ఎత్తుకెళ్లి.. దగ్గర్లోని నీటి కుంటలో (EVM Tossed Into Pond) పడేశారు.
West Bengal: EVM machine was seen floating in water during voting in South 24 Parganas. pic.twitter.com/HInj1D7gLe
— IANS (@ians_india) June 1, 2024
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ చీప్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ప్రాంతంలో ఈవీఎంలు, పేపర్లను దుండగులు దోచుకెళ్లినట్లు చెప్పారు. జరునగర్ (ఎస్సి) పీసీ, 129 కుల్తాలీ ఎసీ వద్ద దొంగల గుంపు వచ్చి దోచుకుందని వెల్లడించారు. అంతేకాకుండా 1 సీయూ, 1 బీయూ, 2 వీవీప్యాట్ యంత్రాలను కూడా చెరువలో పడేశారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ సెక్టార్లో పోలింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. ఆ సెక్టార్ పరిధిలో ప్రస్తుతం మొత్తం ఆరు బూత్‌లలో ఎన్నికల ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
(1/2)
Today morning at 6.40 am Reserve EVMs & papers of Sector Officer near Benimadhavpur FP school, at 129-Kultali AC of 19-Jaynagar (SC) PC has been looted by local mob and 1 CU, 1 BU , 2VVPAT machines have been thrown inside a pond.— CEO West Bengal (@CEOWestBengal) June 1, 2024
Glimpses of democracy thriving in Bengal, which Dhruv Rathee will not make a video on.
– Goons brutally attacked a BJP Karyakarta in Sandeshkhali
– An outsider tried to capture booth in Diamond Harbour for proxy voting, captured by locals. Abhishek Banerjee is contesting from… pic.twitter.com/e77idlms1B
— BALA (@erbmjha) June 1, 2024
Also Read..
Lok Sabha Elections | హిమాచల్‌లో 31 %.. ఒడిశాలో 22 %.. ఉదయం 11 వరకూ పోలింగ్ శాతం ఇలా..
Salman Khan | పాక్ నుంచి తెచ్చిన ఏకే-47 తుపాకులతో.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర..!
Lok Sabha Elections | కొనసాగుతున్న చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు