రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ, జిల్లా అభివృద్ధికి మాత్రం నిధులిస్తలేరు. ఇది జిల్లాకు అన్యాయం చేయడమే. ఈ వివక్షపై ప్రజలు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోతున్నం. నిధులు ఇయ్యకుంటే ప్రజల నుంచి ఉద్యమం తప్పదు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపులో మాత్రం అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జీరోఅవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉమ్మ డి రంగారెడ్డిలో య థేచ్ఛగా భూములు అమ్ముతూ కేటాయింపుల్లో వివక్షపై ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విక్రమించిన భూమి విలువలో 30 నుంచి 15 శాతం వరకు నిధులు జిల్లా అభివృద్ధికి కేటాయించాలని, లేదంటే ప్రజల నుంచి ఉద్యమం తప్పదని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.