Crime news : అతడు కామంతో కళ్లు మూసుకుపోయి మృగంలా ప్రవర్తించాడు. నిండా తొమ్మిదేళ్లు కూడా లేని కన్నబిడ్డనే చెరబట్టేందుకు ప్రయత్నించాడు. బిడ్డపట్ల భర్త ప్రవర్తనను చూసి హతాశురాలైన అతడి భార్య ఎదురుతిరిగింది. భర్తను నిలువరించింది. దాంతో ఆగ్రహం పట్టలేకపోయిన భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2023 నవంబర్ 7, 8 తేదీల మధ్య రాత్రి మైనర్ అయిన తన 9 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అది గమనించిన అతడి భార్య అడ్డుపడింది. గట్టిగా కేకలు వేసి భర్తను నిలువరించింది. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు మరుసటి రోజు భార్యతో గొడవపడ్డాడు. ఆమెను గొంతు నులిమి చంపేశాడు.
అప్పట్లో కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. అతడి పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.