సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 14:40:29

బిహార్‌లో రాత్రి కూడా కొనసాగనున్న లెక్కింపు: ఈసీ

బిహార్‌లో రాత్రి కూడా కొనసాగనున్న లెక్కింపు: ఈసీ

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఈవీఎంలు ఎక్కువగా ఉన్నందున రాత్రి కూడా లెక్కింపు కొనసాగిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఇప్పటివరకు కోటి ఓట్లు లెక్కించినట్లు ఈసీ పేర్కొన్నది. పోలింగ్ బూత్‌ల సంఖ్యలో 63 శాతం పెరుగుదల, ఓటర్లు ప్రతి బూత్‌లో 1,500 నుంచి 1,000 కు తగ్గించారు. కౌంటింగ్ రౌండ్ పోలింగ్ బూత్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మొత్తం దాదాపు 3.1 కోట్ల ఓట్లు లెక్కించనున్నారు. 

"చట్టం ప్రకారం ఈ రోజు ఉదయం 8 గంటల వరకు అందుకున్న అన్ని పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కోసం తీసుకోవాలి. అంటే కౌంటింగ్ కేంద్రాలలో ఈ రోజు ఉదయం 8 గంటల వరకు అందుకున్న పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కోసం తీసుకోవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన డేటా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి అందుబాటులో ఉంటుంది. 50,000 మంది సర్వీస్‌ ఓట్లు వచ్చాయి" అని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నది.

ఈవీఎంలు దృఢమైనవి, ట్యాంపర్ ప్రూఫ్

ఇప్పటివరకు పూర్తిగా లోపం లేని లెక్కింపు ప్రక్రియ జరిగిందని ఈసీ తెలిపింది. బీహార్లో కోటికి పైగా ఓట్లు లెక్కించారని చెప్పింది. "ఈవీఎంలు దృఢమైనవి, ట్యాంపర్‌ ప్రూఫ్‌ అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈవీఎంల సమగ్రతను ఒకటి కంటే ఎక్కువసార్లు సమర్థించింది. ఈసీ కూడా 2017 లో సవాలును విసిరింది. ఈవీఎంల సమగ్రతపై ఎటువంటి సందేహం లేదు” అని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.