Kubera Movie | తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బ్యాంకాక్ షెడ్యూల్లో లీకైన ధనుష్, నాగార్జున లుక్‌లకు సినిమాపై అంచానాలు పెంచాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్లో ధనుష్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఈ చిత్ర షూటింగ్ ముంబయిలోని అతి పెద్ద డంప్‌యార్డ్‌లో జరుగుతుండగా.. మూవీలోని సన్నివేశాలు
సహజంగా రావడం కోసం ధనుష్ 10 గంటల సేపు మాస్క్ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో సినిమాపై అతడికున్న డెడికేషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు.