శనివారం 30 మే 2020
National - May 19, 2020 , 14:54:53

చిరుత వర్సెస్ ముళ్లపంది.. ఎవరు గెలిచారు?

చిరుత వర్సెస్ ముళ్లపంది.. ఎవరు గెలిచారు?

లక్నో: చీకటి పడిన తర్వాత రోడ్డు ఖాళీగా ఉంది. ఓ ముళ్లపంది ఆ రోడ్డుపై తదైన గమ్మత్తయిన నడకతో సాగిపోతున్నది. ఓ చిరుత పిల్ల దానిని చూసి వెంటపడింది. ముళ్లపంది తిరగబడింది. చిరుత కొద్దిసేపు పట్టుకుందామని ప్రయత్నించింది. కానీ ముళ్లపంది తీరు చూసి తోక ముడిచింది. యూపీలోని కటర్నియాఘాట్ జంతుసంరక్షక కేంద్రంలో తీసిన ఈ వీడియో వైరల్ అయింది. అటవీ అధికారి రమేశ్ పాండే ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. మామూలుగా అయితే చిరుతలు ముళ్లపందిని అటూఇటూ చేసి ఒడిసిపట్టుకుంటాయి. కానీ మన వీడియోలేని చిరుత చిన్నది కావడంతో పెద్దగా అనుభవం లేదు. దాంతో ముళ్లపంది నెగ్గింది.


logo