Bus Overturns | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోండియా (Gondia) జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది (Bus Overturns). ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 35 మంది ప్రయాణికులతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MSRTC)కు చెందిన బస్సు నాగ్పూర్ నుంచి గోండియాకు వెళ్తోంది. ఖజ్రీ గ్రామ సమీపంలోకి రాగానే బైక్ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Glenn Phillips: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో
Mahayuti meet called off | సొంత గ్రామానికి షిండే.. మహాయుతి కీలక సమావేశం రద్దు
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్