Glenn Phillips: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో
Glenn Phillips : కివీస్ క్రికెటర్లు ఫీల్డింగ్‌లో నెంబర్ వన్. ఇవాళ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ చూస్తే ఆ విషయాన్ని అంగీకరించాల్సిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో.. ఓలీ పోప్ కొట్టిన షాట్‌ను.. ఫిలిప్స్ డైవ్ చేసి పట్టాడు. ఆ క్యాచ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
క్రైస్ట్‌చర్చ్: ఇండ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో.. న్యూజిలాండ్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips) కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ గల్లీ దిశగా పవర్ఫుల్ కట్ షాట్ ఆడాడు. అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్.. గాలిలో కుడి వైపు ఎగురుతూ ఒంటి చేతితో క్యాచ్ పట్టుకున్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో పోప్ ఔటయ్యాడు. అద్భుతమైన క్యాచ్ పట్టిన ఫిలిప్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
ఇక ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేశాడు. అతను 132 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 319 రన్స్ చేసింది. ఇంకా 29 రన్స్ ఇంగ్లండ్ వెనుకబడి ఉన్నది. పోప్, బ్రూక్ మధ్య 151 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.
ఆల్‌రౌండర్ ఫిలిప్స్‌ను.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సొంతం చేసుకున్నది. అతని బేస్ ప్రైజ్ 2 కోట్లు. గతంలో ఫిలిప్స్ సన్‌రైజర్స్ తరపున ఆడాడు. జెడ్డాలో జరిగిన వేలం తొలి రౌండ్లో అతను అమ్ముడుపోలేదు.
Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u
— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

