అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramasrishna Raju) తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ దర్శన విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రఘురామను ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 13 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 56,952 మంది భక్తులు దర్శించుకోగా 21,714 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.