Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయ సభలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై రెండో రోజూ చర్చ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.
మరోవైపు రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. బీహార్‌లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (SIR)పై నిరసన వ్యక్తం చేశారు. SIRకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎగువసభల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఎంపీలు ఇవాళ ఉదయం పార్లమెంట్ బయటకు ఆందోళన చేపట్టారు. SIRను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
#WATCH | Delhi | The Opposition holds a protest outside the Parliament against the SIR (Special Intensive Revision) issue in Bihar
(Note: Uploaded with better audio-visual quality) pic.twitter.com/gWCBOgI1Id
— ANI (@ANI) July 29, 2025
Also Read..
Coal Missing: 4000 టన్నుల బొగ్గు మాయం.. వర్షాల వల్ల అలా జరిగి ఉంటుందన్న మంత్రి
Heavy rain | ఢిల్లీలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
IT engineer | నేను జీవితంలో ఓడిపోయాను.. బిల్డింగ్‌పై నుంచి దూకి టెకీ ఆత్మహత్య