IT engineer | పూణె (Pune)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల టెకీ (IT engineer) ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హింజెవాడి ఐటీ పార్క్ (Hinjewadi IT Park)లోని అట్లాస్ కాప్కోలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న టెకీని మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన పీయూష్ అశోక్ కవాడే (Piyush Ashok Kavade)గా పోలీసులు గుర్తించారు.
పీయూష్ ఓ ఐటీ సంస్థలో ఏడాది కాలంగా ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌కి హాజరయ్యారు. అయితే, సమావేశంలో ఛాతీలో నొప్పిగా ఉందని పీయూష్ చెప్పినట్లు సహోద్యోగులు తెలిపారు. ఆ కాసేపటికే బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉద్యోగులు అంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
చనిపోవడానికి ముందు పీయూష్ తన తండ్రికి ఓ మెసేజ్ పెట్టినట్లు గుర్తించారు. ‘నేను జీవితంలో ప్రతిచోటా ఓడిపోయాను. మీ కొడుకుగా ఉండటానికి నేను అనర్హుడిని. నన్ను క్షమించండి’ అంటూ పీయూష్ వాళ్ల నాన్నకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలాజీ పాండ్రే తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
Also Read..
Nimisha Priya | నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం