Nimisha Priya | కేరళ నర్సు (Kerala nurse) నిమిష ప్రియ (Nimisha Priya) ఉరిశిక్ష రద్దైందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అవన్నీ అవాస్తవమని పేర్కొన్నాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని మంగళవారం వెల్లడించాయి.
నిమిష ఉరిశిక్షను రద్దు (Death Sentence) చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. అక్కడ జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఉరిశిక్షణ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) వర్గాలు తాజాగా స్పందించాయి. నిమిష మరణశిక్ష రద్దు చేశారంటూ కొంత మంది వ్యక్తులు నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. ఈ విషయంపై తమకు యెమెన్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి.
యెమెన్ జాతీయుడు మహద్ హత్యకేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. మహద్తో కలిసి ఆమె వ్యాపారం చేసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్పోర్టు కోసం అడిగింది. కానీ పాస్పోర్టు ఇచ్చేందుకు మహద్ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో మహద్ మరణించాడు.
దాంతో యెమెన్ పోలీసులు నిమిషను హత్య కేసులో అరెస్ట్ చేశారు. ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణశక్ష విధించింది. ఆ శిక్షను టాప్ కోర్టు సమర్థించింది. దాంతో ఈ నెల 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నిమిషకు శిక్ష తప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన భారత ప్రభుత్వం.. ఇక తాను చేసేదేమీ లేదని చేతులెత్తేసింది. జూలై 16న అమలు చేయాల్సిన మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది.
Also Read..
Kanwariyas: కన్వరియాలతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 18 మంది మృతి
Chirag Paswan | చిరాగ్ పాశ్వాన్ యూటర్న్.. సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేసేది నితీశ్ కుమారే
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..