మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్) పదో తరగతి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వెంకట చైతన్య తానుంటున్న హాస్టల్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తొర్రూరుకు చేరుకున్నారు. విద్యార్థి మృతదేహంతో స్కూలు గేటు మందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని శాంతిపజేశారు. విద్యార్థి మృతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.