మలక్‌పేట, ఫిబ్రవరి 18 : ఆస్తికోసం సొంత వదినపై హత్యాయత్నానికి పాల్పడిన మరిదిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్, ఫల్టన్‌కు చెందిన వలబోజు వెంకటేశ్వర్రావు భార్య సరిత (48) ప్రైవేట్ టీచర్. ఆమెకు కూతురు ఉన్నారు. వెంకటేశ్వర్రావు మే 2023లో మరణించగా.. సరిత, ఆమె కూతురు రితీష సొంత ఇంటి మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. ఆమె మరిది వలబోజు గోవిందరావు అలియాస్ వలబోజు గోవిందరాజ్, అతని తల్లి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుండగా, ఆడపడచు పద్మావతి ముంబైలో నివాసముంటున్నారు. అయితే ఇంటి పత్రాలు ఇవ్వాల ని, ఇల్ల్లు ఖాళీ చేయాలని కొంతకాలంగా గోవింద రాజ్, అతని సోదరి పద్మావతిలు సరితపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆమె ఒప్పుకోకపోగా, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో ఏలాగైన అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు సరిత ఇంటిముందు ఊడుస్తుండగా, ఆమె కూతురు పైనే ఉంది. అదే అనువైన సమయంగా భావించిన గోవిందరాజ్ సరితపై కత్తితో దాడికి దిగాడు. మెడ పట్టుకొని గొంతుపై కత్తితో పొడిచి నీటి డ్రమ్ములో పడేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేయగా కూతురు రితీష కిందకు వచ్చి తల్లిని కాపాడేందుకు యత్నించగా గోవిందరాజ్ ఆమెను తోసివేశాడు. దాంతో భయపడిపోయిన రితీష పక్కనే పాలకొట్టు వద్దకు వెళ్లి ఇరుగు పొరుగువారిని తీసుకొని వచ్చేసరికి గోవిందరాజ్ పారిపోయాడు. ఆస్తికోసం ఇంటిని ఖాళీ చేయించడానికి హత్యాయత్నానికి పాల్పడిన గోవిందరాజ్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు న మోదుచేసిన చాదర్‌ఘాట్ పోలీసులు, బుధవారం నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.