న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్‌కు ఎంత క్రేజీ ఉందో తెలిసిన విషయం తెలిసిందే. ఆ రెండు జట్లు తలపడితే ఆ టెన్షనే వేరు. అయితే తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ఆ రెండు జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడితే ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు తన అంతరాత్మ ఒప్పుకోదన్నారు.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఎలా పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతారని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ విమానాలు మన వైమానిక క్షేత్రంలోకి రావడం లేదని, మన జలాల్లోకి వాళ్ల బోట్లు రావడం లేదని, ఆ దేశంతో వాణిజ్యం జరగడం లేదని, అలాంటప్పుడు పాకిస్థాన్‌తో ఎలా క్రికెట్ ఆడుతారని ఓవైసీ ప్రశ్నించారు.
ఆ దేశానికి మనం నీళ్లు ఇవ్వడం లేదని, పాక్‌కు వెళ్లే 80 శాతం నీటిని ఆపేస్తున్నామని, రక్తం.. నీరు ఒకేసారి పారవని అంటున్నామని, అలాంటప్పుడు ఆ దేశంతో ఎలా క్రికెట్ ఆడుతారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు తన అంతరాత్మ అంగీకరించదన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరిగే ఆసియాకప్‌లో 8 దేశాలు ఆడనున్నాయి.
With what face are you going to play cricket with Pakistan… Owaisi surrounded the government in Parliament on Asia Cup – Owaisi questions India is not ashamed to play cricket with Pakistan Parliament monsoon session 2025 Operation Sindoor – Navbharat Times…
— Asaduddin Owaisi (@asadowaisi) July 28, 2025