సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు చోట్ల మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.5కిలోల గంజాయి, 1.30కిలోల భంగ్ గోలీలు, 200గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీ నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…సాలార్జంగ్ మ్యూ జియం ఉస్మాన్‌షాహీ ప్రాంతానికి చెందిన సబాస్ ఖాన్ స్థానికంగా ఒక రౌడీ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలు నేరాలకు పాల్పడుతూ..డబ్బుకోసం గం జాయి విక్రయాలకు సైతం పాల్పడుతున్నాడు. ఈ మేర కు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు సబాస్ఖాన్ ఇంటిపై దాడిచేసి.. 1.5కిలోల గంజాయితో పా టు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర కు సబాస్ఖాన్తో పాటు అతడి అనుచరులైన సయ్యద్ మహబూబ్ అలీ, మమ్మద్ నుమన్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1.5కిలోల గంజాయితో పాటు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును చార్మినార్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
మత్తు గోలీలు, చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి ..
నేరుగా గంజాయి విక్రయిస్తే పోలీసులు పట్టుకుంటారని భావించిన కేటుగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా వాటిని గోలీలు, చాక్లెట్ల రూపంలో విక్రయిస్తూ అడ్డంగా దొరిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే…చుడీబజార్, శంకర్ బజారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు స్థానికంగా నివాసం ఉండే లవకుశ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ ల్లో లవ్‌కుశ్ వద్ద 1.30 కేజీల భంగ్ గోలీలు(గంజాయి గోలీలు), 200 గ్రాముల గం జాయితో తయారు చేసిన మత్తు చాక్లెట్లు లభించాయి. ఈ మేరకు లవకుశ్ శర్మతో పాటు భాను ప్రతాప్‌లను ఆరెస్టు చేసి, వారి వద్ద నుంచి బంగ్, మత్తు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా విమానాల్లో నగరానికి తీసుకువచ్చిన 35నా న్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను పహాడీషరీఫ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు.