ర్యాంకింగ్‌లో డీలా.. మెరుగుపడేదెలా.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో డిగ్రీ కళాశాలల వెనుకంజ
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు ఏటేటా డీలా పడుతున్నాయి. మొత్తం 1,099 డిగ్రీ కాలేజీలు ఉండగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు పోటీ పడేవి తక్కువగా ఉండటం గమనార్హం. వీటి సంఖ్య కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నది.
- ఫ్యాకల్టీకి అవగాహన కల్పిస్తున్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ) : నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు ఏటేటా డీలా పడుతున్నాయి. మొత్తం 1,099 డిగ్రీ కాలేజీలు ఉండగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు పోటీ పడేవి తక్కువగా ఉండటం గమనార్హం. వీటి సంఖ్య కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వర్క్‌షాప్ నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొని ర్యాకింగ్ మెరుగుపర్చడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు పలు సమస్యలు లేవనెత్తారు.
ప్రధాన సమస్యలు ఇవే..
- గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు నగరాల్లోని కాలేజీలతో ఎలా పోటీపడగలవు. రూరల్ కాలేజీలకు ప్రత్యేక ర్యాంకింగ్ ఇవ్వాలి.
- కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు బడ్జెట్ ఇవ్వట్లేదు. ఈ పరిస్థితుల్లో రిసెర్చ్ ఎలా మెరుగుపడుతుంది?
- ప్రభుత్వ కాలేజీల్లోని అధ్యాపకులకు గైడ్షిప్ ఇవ్వకుండా ప్రైవేట్ వారికే ఇస్తున్నారు. ఈ వ్యత్యాసమెందుకు?
- సిలబస్ పూర్తి, ఇంటర్నల్స్, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకే సమయం ఉండట్లే. ర్యాకింగ్ కోసం పోటీపడే సమయమేది?
- సంప్రదాయ కోర్సుల్లో సీట్లు నిండటం లేదు. విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు. క్లాసులకు డుమ్మా కొడుతున్నారు. ఉత్తీర్ణతాశాతం తక్కువగా ఉంటున్నది. ఈ క్యాటగిరీలో స్కోర్ మెరుగవటం లేదు.
- ఎన్ఐఆర్ఎఫ్ ప్రమాణాలేమో విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి 1:20గా ఉండాలంటుండగా, కాలేజీల్లో 1:100 చొప్పున ఉంటున్నారు.
ఈ వ్యత్యాసాన్ని సవరించేదెలా..?
2025లో ఆరు కాలేజీలే.. జాతీయంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాం కింగ్‌కు పోటీపడే కాలేజీల సంఖ్య పెరుగుతున్నది. గతంలో కాలేజీల సంఖ్య 3,500 మాత్రమే ఉండగా, ఇప్పుడది 8,500కు చేరింది. ర్యాంక్ రావడంతో కాలేజీల ప్రతిష్ట పెరుగుతున్నది. మెరుగైన ఫ్యాకల్టీ, ప్రతిభగల విద్యార్థులు కాలేజీలో చేరేందుకు పోటీపడతారు. ఏ కాలేజీ ఉత్తమమైనదో గుర్తించేందు కు ఈ ర్యాకింగ్ దోహదపడుతుంది. టాప్ ర్యాంకింగ్ కాలేజీల్లో ప్లేస్మెం ట్స్ డ్రైవ్‌లు చేపట్టేందుకు కంపెనీలు పోటీపడతాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకిం గ్ కోసం 2025లో రాష్ట్రం నుంచి తక్కువ కాలేజీలు పోటీపడ్డాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

