Heavy rain | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వర్షం దంచికొట్టింది. ఈ వర్షానికి అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
#WATCH | Commuters wade through a waterlogged street in the Devli area of Delhi, as the national capital witnesses an intense spell of rain pic.twitter.com/4gGpZyslic
— ANI (@ANI) July 29, 2025
రోడ్లపైన భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఉదయం కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం కురిసిన వర్షానికి విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు చేశాయి.
#WATCH | Delhi | Severe waterlogging in parts of the National Capital following heavy rains this morning
(Visuals from Pragati Maidan) pic.twitter.com/vixuKYoRfb
— ANI (@ANI) July 29, 2025
మరోవైపు ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆగస్టు 3 వరకూ వచ్చే ఏడు రోజుల పాటూ దేశ రాజధానిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
#WATCH | Delhi | Traffic flows smoothly at Minto Bridge amid heavy rainfall in the city pic.twitter.com/TJ5Jhl8OdJ
— ANI (@ANI) July 29, 2025
#WATCH | Heavy rain triggers waterlogging at Delhi’s Panchkuian Road, commuters face trouble pic.twitter.com/pNIDQMkpOX
— ANI (@ANI) July 29, 2025
Also Read..
IT engineer | నేను జీవితంలో ఓడిపోయాను.. బిల్డింగ్పై నుంచి దూకి టెకీ ఆత్మహత్య
Nimisha Priya | నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం